బాలయ్య సినిమాలో విలన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇక ఆ కాంబోకి బోయపాటి కలిస్తే ఇంక చెప్పేదేముంది. అంతకు మించి అన్నట్లుగా విలన్ ని సెట్ చేస్తారు. దాంతో ఆ కాంబో భాక్సాఫీస్ దగ్గర తాండవమే. ఇప్పుడు మరోసారి నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం ‘అఖండ 2: తాండవం’.ఆది పినిశెట్టి తన కెరీర్‌లో ఒక ఎక్సయిటింగ్ చాపర్ట్‌ని మార్క్ చేస్తూ, ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రను పోషించబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమాలో ఆదిని ఇంటెన్స్ పాత్రలో చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో మరోసారి ఫెరోషియస్‌గా, తన కెరీర్‌లో మోస్ట్ ఇంపాక్ట్ పాత్ర చేయబోతున్నారని తెలుస్తోంది.

ఆది ఈ ‘అఖండ 2: తాండవం’ లో కొత్త లుక్‌‌లో కనిపించనున్నారని.. బాలకృష్ణ, ఆది మధ్య జరిగే పేస్ ఆఫ్ అభిమానులకు ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ విజువల్ ఫీస్ట్ అందించబోతోందని నిర్మాతలు చెబుతున్నారు.

‘అఖండ 2: తాండవం’ సినిమాతో బోయపాటి, బాలయ్య నాల్గవసారి కొలాబరేట్ అయ్యారు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్.

‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

బాలయ్య కుమార్తె ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

, ,
You may also like
Latest Posts from