గత కొద్దికాలంగా చిరంజీవి సినిమాల్లో నెక్ట్స్ లెవిల్లో ఎనర్జీ కనిపిస్తోంది. మరోవైపు నయనతార… సౌత్ ఇండియాలో లేడీ సూపర్‌స్టార్‌గా సత్తా చాటుతున్న శక్తివంతమైన నటి. గతంలో ఈ ఇద్దరూ కలిసిన సినిమాలు “సైరా నరసింహారెడ్డి”, “గాడ్ ఫాదర్” బాక్సాఫీస్ వద్ద హిట్ అయినా, వీరిద్దరి మధ్య మాస్ మాజిక్ కనిపించలేదు.

అందుకే అభిమానుల్లో ఒక ఆవేదన ఉండేది – “ఇద్దరూ స్క్రీన్‌పై ఉన్నా… మాస్ గా ఎందుకు అదరకొట్టలేకపోయారు?”

ఇప్పుడు అదే మాస్ ఉత్సవం జరిగేలా కనిపిస్తోంది!

సోర్సుల సమాచారం ప్రకారం, చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే కొత్త సినిమాలో నయనతార హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందట!

ఈసారి మాత్రం కథలో ఆమెకు పూర్తి స్థాయి పాత్ర, పవర్‌ఫుల్ మాస్ సీన్లు, సాంగ్స్ – అన్నీ ఉండబోతున్నాయట. మునుపటి రెండు సినిమాల్లో కథా నేపథ్యం వల్ల నయనతారకు మాస్ ఎలిమెంట్స్ ఏవీ లేవు. కానీ ఈ సినిమా మాత్రం పక్కా ఎంటర్టైనర్!

అనిల్ రావిపూడి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట. ఇప్పుడు ప్రధాన పాత్రధారుల ఎంపికలో బిజీగా ఉన్నాడని సమాచారం.

ఈ కాంబోపై అభిమానుల్లో బోలెడంత ఉత్సాహం ఉంది. ఎందుకంటే…

“చిరు స్టైల్ + నయన్ గ్లామర్ + అనిల్ కామెడీ పంచ్ = ఫుల్ మాస్ ట్రీట్” అన్న నమ్మకం వారిలో పోటెత్తిపోతోంది!

ఈ కాంబినేషన్ అధికారికంగా ప్రకటిస్తే, ఇది మెగా అభిమానులకు  పండుగే!

,
You may also like
Latest Posts from