ఇకపై అల్లు అర్జున్ ని ‘పుష్ప’ కాదు… ‘ప్లాన్’ స్టార్ అన్నా పర్లేదు! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే… మరోవైపు తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై octane యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ నుంచి కొద్ది గ్యాప్ తీసుకున్న బన్నీ… అమెరికా వెళ్లిపోయాడు.
టాంపా, ఫ్లోరిడాలో జరిగిన NATS (North America Telugu Society) ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్… అక్కడ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు ఆయాన్, అర్హలతో కలిసి హాలిడే మూడ్‌లోకి మారిపోయాడు. కానీ, విహారయాత్రలో ఉన్నా… సినిమా పనులు మాత్రం విడిచిపెట్టలేదు. యూఎస్‌లోనే ఉన్న వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్న నేపథ్యంలో… వాటి పనిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడట బన్నీ.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఆగస్టులో ముంబైలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. దర్శకుడు ఆట్లీ ప్రస్తుతం షూటింగ్ ప్లాన్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఈ భారీ మల్టీస్టారర్‌లో దీపికా పదుకోణే హీరోయిన్స్ గా నటిస్తుండగా, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అందులో రష్మిక నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతోందన్న వార్త హాట్ టాపిక్ అయింది.
అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా హక్కులను Sun Pictures పొందగా… విడుదల తేదీ విషయానికి వస్తే, ఇది 2027లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అంటే ఇంకొన్ని సంవత్సరాల పాటు బన్నీ మ్యానియా కొనసాగుతుందన్నమాట!