పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu: Sword vs. Spirit) పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నో వాయిదాల తర్వాత జూలై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ సమయం దగ్గరపడినా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఇంకా పరిష్కారానికి అవ్వలేదన్నది ఇండస్ట్రీ టాక్.

హరిహర వీరమల్లు రిలీజ్‌కు 150 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అవసరం

ఇప్పటికీ హరిహర వీరమల్లు థియేట్రికల్ బిజినెస్‌లో రూ.150 కోట్లు చేయాల్సిన అవసరం ఉందని సమాచారం. ఈ చిత్రం ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి అనేక కారణాలతో వాయిదాలు పడింది. అందుకే అసలు బడ్జెట్ కంటే రెండింతలు అయ్యింది. ఆర్థికంగా బాగానే దెబ్బతిన్న ఈ చిత్రం ప్రస్తుతం బిజినెస్ క్లోజింగ్ దశలో ఉంది.

ట్రైలర్ తర్వాత ట్రేడ్ లో క్రేజ్ పెరిగింది

ట్రైలర్ విడుదలయ్యేంతవరకు ట్రేడ్ వర్గాల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ ట్రైలర్ రావడంతో పాటు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలతో నిర్మాత ఏ.ఎం.రత్నం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

సక్సెస్ అయితే పార్ట్ 2 కూడా

ఈ సినిమా విజయవంతమైతే.. గతంలో వచ్చిన ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, అలాగే పార్ట్ 2 తెరకెక్కించే అవకాశాలు బలంగా ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు కూడా లాభదాయకంగా మారనుంది.

ఇండస్ట్రీకి కూడా ఈ సినిమా విజయం ఎంతో అవసరం. పవన్ కళ్యాణ్ ఇమేజ్, కథాపరిణామం, గ్రాఫిక్స్—all elements కలిసొస్తే, ఈ సినిమా తిరుగులేని హిట్ అవుతుందన్న నమ్మకం వర్గాల్లో ఉంది.

ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , ఎఎం జ్యోతి కృష్ట దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామాలో కనిపించడం, భారీ సెట్టింగ్‌లు, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. నిధి అగర్వాల్, నోరా ఫతేహి వంటి నటీమణులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది . ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆతృత రెట్టింపు అయ్యింది. సెన్సేషనల్ ప్రీమియర్ సేల్స్‌తో ‘హరిహర వీరమల్లు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా పయనిస్తోంది. థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే సీడెడ్‌లో అమ్ముడుపోవడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..

, , , , , ,
You may also like
Latest Posts from