
ఆగస్టులో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పరమ్ సుందరి’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది! సిద్దార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా… ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో మళ్లీ చర్చనీయాంశమైంది.
ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?
ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది! ఇంతకు ముందు రెంటల్‌గా అందుబాటులో ఉన్నా… ఇప్పుడు ఎవరైనా సులభంగా చూడొచ్చు. ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ప్రత్యేక పోస్టర్ని రిలీజ్ చేస్తూ “లవ్ ఈజ్ బ్యాక్ ఆన్ స్క్రీన్” అంటూ హడావుడి చేసింది.
కథ ఏంటంటే..
ఢిల్లీకి చెందిన బిజినెస్ ఫ్యామిలీకి వారసుడైన పరమ్ (సిద్దార్థ్ మల్హోత్రా) తన తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి తన విలువను నిరూపించుకోవాలనుకుంటాడు. కానీ చేసిన ప్రతి స్టార్టప్ ఓటమి చవిచూస్తుంది. చివరికి ఒక డేటింగ్ యాప్ — ‘Find My Soulmate’ — ఐడియాతో ముందుకు వస్తాడు.
దీనికి రూ.5 కోట్లు కావాలని తండ్రిని అడిగితే… తండ్రి ఒక షాకింగ్ కండీషన్ పెడతాడు . ఆ కండీషన్ నెరవేర్చడానికి కేరళకు వెళ్లిన పరమ్ అక్కడ సుందరి (జాన్వీ కపూర్) ఇంట్లో హోమ్ స్టేకు దిగుతాడు. మొదట పరిచయం… తర్వాత ప్రేమ… కానీ సత్యం బయటకు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
ఇకపోతే సుందరి పెళ్లి వేణు నాయర్ అనే వ్యక్తితో ఫిక్స్ అవుతుంది. మరి పరమ్ పరిస్దితి.. పరమ్ తండ్రి పెట్టిన కండీషన్ ఏమిటి? లేక ప్రేమే చివరికి గెలిచిందా? ఈ సమాధానాల కోసం ‘పరమ్ సుందరి’ ఓటీటీలో మీకోసం రెడీగా ఉంది!
మూవీ టీమ్:
దర్శకత్వం – తుషార్ జలోటా
నిర్మాణం – దినేష్ విజన్ (మడాక్ ఫిలిమ్స్)
తారాగణం – సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, సంజయ్ కుమార్, సిద్ధార్థ్ శంకర్
