నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తెలుగులో మినిమమ్ గ్యారంటీ హీరో . టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు మంచి ఓపెనింగ్స్ రాబడుతుంటాయి. మూవీ ప్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు ఉండవు. దాంతో నాన్ థియేట్రికల్ కు మంచి రేటు పలుకుతోంది.

మాగ్జిమం ఓటిటి, శాటిలైట్, యూట్యూబ్ రైట్స్ లోనే చాలా వరకు బడ్జెట్ రికవరీ అవుతోంది. మరీ ముఖ్యంగా నిర్మాతగా, నటుడుగా నాని బ్రాండ్ వేల్యూ కూడా బాగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆలోచించే నిర్మాతలు ఇప్పుడు నాని మీద పెట్టుబడి పెట్టడానికి ఓటిటి సంస్దలు పోటీ పడుతున్నాయి.

. ‘దసరా’ ‘హాయ్ నాన్న’ ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలు మంచి రేటుకు ఓటీటిలో అమ్ముడయ్యాయి. సినిమా సినిమాకు అతని ఓటీటీ మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ఇంకా రెగ్యులర్ షూట్ కి వెళ్లని ‘ది ప్యారడైజ్’ సినిమా డిజిటల్ రైట్స్ కి మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓ సంస్థ సుమారు రూ. 65 కోట్లు కోట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాస్త అటు అటుగా ఇదే డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

, ,
You may also like
Latest Posts from