
‘DJ టిల్లూ’లో రాధికగా మెరిసి ఒక్కసారిగా గ్లామర్ బ్యూటీగా ఇమేజ్ సెట్ చేసుకున్న నేహా శెట్టి కు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె ఫుల్ బిజీ అయ్యిపోతుందని అందరూ భావించారు. అయితే అనుకున్నట్లు జరగలేదు. కానీ పవన్ కళ్యాణ్ OG కోసం స్పెషల్ సాంగ్ చేసింది. బ్యాంకాక్‌లో గ్రాండ్‌గా షూట్ చేసిన ఈ సాంగ్ రన్‌టైమ్ ఇష్యూస్‌తో కట్ అయ్యిందట.
ఫ్యాన్స్ థియేటర్‌లో ఆమె హాట్ డ్యాన్స్ మిస్ అయినా… నేహా మాత్రం పెద్ద మొత్తంలో పేమెంట్ వసూల్ చేసుకుందని సమాచారం.

ఈ విషయమై డైరెక్టర్ సుజీత్ కౌంటర్ కూడా ఆసక్తికరంగా మారింది – “మనం ఎప్పుడైనా ఆ సాంగ్ ఉందని చెప్పామా?” అని క్లారిటీ ఇచ్చేశారు.
Gangs of Godavari (2024) తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయని నేహా, ప్రస్తుతం 1.4 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో గ్లామర్ గేమ్‌ను కొనసాగిస్తూ హాటెస్ట్ ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది.

స్క్రీన్ మీద మిస్ అయినా… సోషల్ మీడియాలో నేహా మ్యాజిక్ ఓనింగ్ చేస్తూనే ఉంది!
