
యూట్యూబ్/సోషల్ మీడియాలో క్రేజ్ క్రియేట్ చేసిన మౌళి తనూజ్ ప్రసాంత్ నటించిన లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. థియేటర్స్‌లో దుమ్ము రేపిన ఈ మూవీ, ఇప్పుడు OTTలో రిలీజ్ డేట్ విషయంలోనే నెటిజన్ల నవ్వులపాలైంది.
ఇటీవలే ETV Win తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో అందరూ దసరా వీకెండ్ తర్వాత లేదా రెండో వారంలో వస్తుందేమో అనుకున్నారు.
The blockbuster rom-com of the year coming to your home…💖#LittleHearts (Extended Cut 🤩)
— OTT Trackers (@OTT_Trackers) September 26, 2025
Streaming from Oct 1 only on @etvwin 🍿!!#OTT_Trackers pic.twitter.com/bJWZU3fM3V
కానీ షాకింగ్‌గా… సడెన్‌గా టీమ్ అక్టోబర్ 1నే స్ట్రీమింగ్ డేట్ అని అనౌన్స్ చేసింది! దీంతో నెటిజన్లు ఫుల్ మీమ్స్ వేసి, “మాట ఇచ్చి మారు రోజు మార్చేశారే!” అంటూ ETV Winను ట్రోల్ చేశారు.
థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) ఎక్స్టెండెడ్ కట్’ (అదనపు సన్నివేశాలుండటం)ను రిలీజ్ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది కొంత ఆనందం.
యువ సత్తా చాటిన చిత్రమిది. దర్శకుడిగా సాయి మార్తాండ్, హీరోగా మౌళి తనూజ్, సంగీత దర్శకుడిగా సింజిత్ యర్రమల్లి తదితరులు తొలి ప్రయత్నంలోనే పెద్ద విజయాన్ని అందుకోవడం విశేషం. దాదాపు రూ.2.5కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.33 కోట్లకుపైగా వసూలు చేసింది.
‘ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్’లో రూపొందిన ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 5న బాక్సాఫీసు ముందుకు తీసుకొచ్చారు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలు ఈ చిత్రాన్ని మెచ్చి, చిత్ర టీమ్ కి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.
