బాక్స్ ఆఫీస్ లో వరుస ఫ్లాప్‌లతో కాస్త డౌన్ ఫేజ్‌లో ఉన్న నితిన్, ఇప్పుడు పూర్తి రీసెట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. తాజాగా వచ్చిన “తమ్ముడు” ఫెయిల్యూర్ తర్వాత, ఇప్పటివరకు ఓకే చెప్పిన అన్ని ప్రాజెక్ట్స్‌ను సైడ్‌లో పెట్టేసి, ఒకే ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడట.
ఆ సినిమా ఎవరిదంటే? “ఇష్క్” తో బ్లాక్‌బస్టర్ కొట్టిన డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో మళ్లీ జతకట్టబోతున్నాడు నితిన్. ఈ సారి స్టోరీ స్పోర్ట్స్ డ్రామా లైన్‌లో ఉండబోతుందట.
ఇక మాస్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న టాక్ ఏంటంటే – ఈ మూవీకే “స్వారీ” అనే టైటిల్‌ను కన్‌సిడర్ చేస్తున్నారని టాక్. కానీ ఫైనల్ ఫిక్స్ అయ్యిందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జోరుగా జరుగుతుండగా, కాస్టింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ తర్వాతే నితిన్ ఇతర ప్రాజెక్ట్స్‌పై హ్యాండ్ వేసే అవకాశం ఉందని ఇన్‌సైడర్ టాక్.
