ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పౌరాణిక గాథ ‘గాడ్ ఆఫ్ వార్’ పై మళ్ళీ ఫోకస్ మారింది. lord కార్తికేయ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే సంవత్సరం సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో స్ట్రాటజీలో పెద్ద మార్పే జరిగింది.

ఇంతకుముందు ఈ నెలాఖరున ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్‌తో మూవీని అధికారికంగా ఎనౌన్స్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కానీ ఇటీవల యశ్ – రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణ’ టీజర్ చూసిన తర్వాత ఆ యూనిట్ ఆలోచనలు మారాయి.

ప్రొడ్యూసర్ నాగ వంశీ తెలిపిన ప్రకారం – ఇప్పుడు ఈ సినిమా గ్లింప్స్‌ను ఇంకా గ్రాండ్‌గా, విజువల్స్ పరంగా గ్రాండ్ గా ప్రెజెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. “గాడ్ ఆఫ్ వార్” విషయంలో త్రివిక్రమ్ తొలిసారిగా భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌కు మొగ్గుచూపుతున్నాడు. ఇది ఆయన కెరీర్‌లోనే ఒక కొత్త ప్రయోగం అవుతుంది.

సరైన సాంకేతికతతో, సినిమాటిక్ స్కేల్‌తో ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో ప్రెజెంట్ చేయాలని టీమ్ పట్టుదలగా ఉంది. ఇప్పటి వరకు త్రివిక్రమ్ చెప్పిన ఎమోషనల్ స్టోరీలు ఎలా గుర్తుంటాయో, ఈసారి ఈ విజువల్ స్పెక్టాకుల్‌కి ఆయన ఎలాంటి అద్బుతం చేస్తారో చూడాలి!

, , ,
You may also like
Latest Posts from