“వార్ 2” రిలీజ్ పంక్షన్ లో చేసిన కామెంట్స్ తో NTR చుట్టూ ఓ కనపడని వివాదం నెలకొంది. సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దానికి సినిమా బాక్సాఫీస్‌లో ఊహించిన విజయాన్ని అందుకోకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇవి చాలదన్నట్లు TDP ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు – ఇవన్నీ కలసి NTRను చుట్టూ వివాదాల కంచెను వేసాయి. ఇక్కడే మరో హీరో అయితే రెచ్చిపోయి కామెంట్స్ చేసేవారు. నోరు జారేవారు.
కానీ NTR ఏవీ రెస్పాండ్ కాకుండా, గంభీరంగా మౌనంగా వ్యవహరిస్తూ, వివాదాలను పుంజుకోకుండా చూసుకున్నారు. పబ్లిక్‌గా ఎటువంటి ప్రకటన చేయకుండా, ఈ అంశాలపై స్పందించకుండా సైలెంట్ గా ఉండటం ఆయన తెలివైన స్టాటజీ అనే చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుందని ఆయనకు అనుభవంతో తెలుసు. ఎక్కడ ఎగరాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే తెలివైన హీరో అని ముందునుంచి ఎన్టీఆర్ కు తెలుసు.
అయితే ఈ స్ట్రాటజీని అర్దం చేసుకోని ఫ్యాన్స్ మాత్రం తగ్దేదే లే అన్నట్లు తిరుగుతున్నారు. ఆయన సినిమాల విజయానికి పార్టీ వ్యతిరేకంగా పని చేస్తుందని చెప్పినట్లు హెచ్చరికలు చేస్తున్నారు.
వృత్తిపరంగా చూస్తే, NTR తన కొత్త చిత్రం “డ్రాగన్” షూటింగ్‌ను రాబోయే నెలలో పునః ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ప్రకాశ్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై-యాక్సన్ డ్రామా షూటింగ్లో చాలా భాగం ఇప్పటికే పూర్తి అయ్యింది.