పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ డేలో రికార్డులు బద్దలుకొట్టి సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రెండో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ-సెంటర్స్‌లో డ్రాప్ సాధారణంగా ఉన్నా, మాస్ సెంటర్స్‌లో ఫాల్ భారీ స్థాయిలో ఉంది, ఇది మేకర్స్‌కి టెన్షన్ పెడుతోంది.

రెండో రోజు కలెక్షన్లు బలహీనంగా ఉండటానికి ప్రీ-ఫెస్టివల్ ఎఫెక్ట్ కూడా కారణమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అంతేకాక, టాక్ రీజియన్‌కి రీజియన్ మారుతూ ఉండటంతో ఫలితాలు కలగలిపిగా కనిపిస్తున్నాయి.

ఏ-సెంటర్స్‌లో ఓకే ఫైనల్ నంబర్స్ రాగా,
మాస్ సెంటర్స్‌లో మాత్రం మిక్స్ టాక్ ప్రభావం తీవ్రంగా పడుతోంది.

దసరా సెలవులు మొదలైతే మాస్ సెంటర్స్‌లో కలెక్షన్లు మళ్లీ రాబోతోన్నాయని, అదే ఓజీ భవిష్యత్తు కోసం కీలకం అని అనలిస్టులు చెబుతున్నారు.

శనివారం, ఆదివారం కావడంతో ఫ్రైడేతో పోలిస్తే జంప్ ఉండే అవకాశాలు పక్కాగా కనిపిస్తున్నాయి. డే 3, డే 4లో బలమైన పికప్ కనబరిస్తే – దసరా వేవ్‌లో ‘ఓజీ’ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం.

అలాగే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాకి ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. ఆయన సినిమాలు వస్తే థియేటర్ల వద్ద అభిమానుల హడావుడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇప్పుడు పవన్‌ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్‌కి ముందే రికార్డులు తిరగరాయబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని రీతిలో ఓజీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 150 కోట్ల మార్క్‌ దాటి 172 కోట్లకు చేరింది. ఇది పవన్‌ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌. ఈ లెక్కలతోనే పవన్‌ మానియా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

అలాగే ఇంతవరకూ 100 కోట్ల మార్క్‌ దాటని పవన్‌ సినిమాలు, ఓజీ తో మాత్రం దానిని దాటేసి కొత్త రికార్డు నమోదు చేశాయి. ఇండస్ట్రీ టాక్‌ ప్రకారం, రిలీజ్‌ అయిన 10 రోజుల్లోనే పెట్టుబడి రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయట. సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది కాబట్టి బాక్సాఫీస్‌ వద్ద దూకుడు మామూలుగా ఉండదని అంచనా వేస్తున్నారు.

సినిమా మొత్తం 340–350 కోట్ల గ్రాస్‌ వసూలు చేస్తే బ్రేక్‌ఈవెన్‌ సాధించినట్టే. దసరా సెలవులు కలిసి రావడం వల్ల భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఓజీ సెప్టెంబర్‌ 25న గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది. అయితే, 24 రాత్రి నుంచే బెనిఫిట్‌ షోలు ఏర్పాటు చేసారు. దీంతో పవన్‌ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

, , , , ,
You may also like
Latest Posts from