
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “దే కాల్ హిమ్ OG” బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేస్తూ, ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అవగా, అదే సమయంలో పవన్ ఆరోగ్యం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
ఓజీ – రికార్డ్ బ్రేకింగ్ హిట్!
రిలీజ్‌కి ముందు నుంచే ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్నంటిన OG, ఇప్పుడు కలెక్షన్స్‌తో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ టాప్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ, వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ కలెక్షన్స్ రాబడుతోంది.
పవన్ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది
ఓజీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు నుంచే పవన్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా మెడికల్ కేర్‌లో ఉన్నప్పటికీ, జ్వరం తగ్గకపోవడంతో డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్‌లో ఫర్దర్ టెస్టులు చేయించుకోవాలని నిర్ణయించారు. ఈ రోజు మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు.
ఫ్యాన్స్ ఆందోళన, విషెస్
పవర్ స్టార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్స్‌తో విశెస్ పంపిస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్న వెంటనే, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఒకవైపు బాక్సాఫీస్ వద్ద OG రికార్డులు క్రియేట్ చేస్తుంటే, మరోవైపు పవన్ ఆరోగ్యం ఫ్యాన్స్‌కి టెన్షన్ పెడుతోంది.
