ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కు హీరోలు దొరకటం కష్టంగా ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో మాస్​ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్‌గా పూరీ జగన్నాథ్‌ వెలిగారు. ఆ టైమ్ లో తమ హీరో ఒక్క సినిమా అయినా పూరీ డైరెక్షన్‌లో చేయాలని ‍ప్రతి అభిమాని కోరుకుంటాడు. అయితే, లైగర్‌,డబుల్ ఇస్మార్ట్ వంటి వరుస ప్లాపులతో ఆయన ప్రస్తుతం సతమతం అవుతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఏ హీరో కూడా కథ వినటానికి ఉత్సాహం చూపటం లేదు.

అయితే తన కథన లోపాలు సరిచేసుకుని ఈసారి బలమైన కథతో పాటు ఇండస్ట్రీలో హిట్‌ కొట్టాలని ఆయన పక్కా ప్లాన్‌తో రానున్నారని టాక్‌. వరస ప్లాపులతో ఉన్న దర్శుకుడితో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు జంకుతారు.

కానీ, పూరీ కాస్త డిఫరెంట్‌ ఒటమి వస్తే ఎలా నిలబడాలో తెలిసిన డైరెక్టర్‌..అందుకే ఎక్కడా ప్రయత్నాలు ఆపటం లేదు. ఈ క్రమంలో ఆయన తెలుగు నుంచి కాకుండా తమిళం నుంచి విజయ సేతుపతి కోసం ఓ కథను రెడీ చేసినట్లు సమాచారం.

విజయ్ సేతుపతికు ఓ కథ చెప్పి ఒప్పించి, ఓ పెద్ద హిట్ ఇచ్చి మళ్లీ తనేంటో చూపించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు పూరి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వినికిడి. అయితే విజయ్ సేతుపతి పూర్తి బిజిగా ఉన్నారు. ఈ టైమ్ లో పూరి తో సినిమా చేస్తారా అనేది సందేహమే.

,
You may also like
Latest Posts from