అమెరికాలో బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’ – ‘వార్ 2’ పోటీకి మొదటి రౌండ్ ఫలితం వచ్చేసింది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ మల్టీస్టారర్ వార్ 2ని, రజనీకాంత్ మాస్ ఎంటర్‌టైనర్ కూలీ ఊహించని రీతిలో దాటేసింది.
ప్రిమియర్ + ఫస్ట్ డే కలెక్షన్స్ (నార్త్ అమెరికా):
కూలీ: $3.94 మిలియన్ (మొత్తం)
వార్ 2: $1.41 మిలియన్ (మొత్తం)
ఇక హాట్ టాపిక్ – తెలుగు వెర్షన్.
కూలీ తెలుగు వెర్షన్ మాత్రమే $1.3 మిలియన్ కొల్లగొట్టి, ఈ ఏడాది హయ్యెస్ట్ ప్రిమియర్ రికార్డ్ క్రియేట్ చేసింది.
వార్ 2 తెలుగు వెర్షన్ మాత్రం కేవలం $603K వద్ద ఆగిపోయింది — ఎన్టీఆర్ ఉన్నా, యష్ రాజ్ ఫ్రాంచైజ్ బ్రాండ్ ఉన్నా, ఇది షాకింగ్ నెంబర్‌గానే చెప్పాలి.
ప్రస్తుతం ఫస్ట్ రౌండ్ విన్నర్ స్పష్టంగా కూలీనే.
మరి ఇక వచ్చే రోజుల్లో ఈ రేస్ ఎటు తిరుగుతుందో చూడాలి… కానీ స్టార్ట్ మాత్రం కూలీదే బాస్ లెవెల్!