ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన వరస సినిమాలు డిజాస్టర్స్ అవుతూ వస్తున్నాయి. క్రాక్, ధమాకా సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సరైన సినిమా ఒక్కటీ కూడా లేదు. ఈ వరస ఫెయిల్యూర్స్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆయన మార్కెట్ కుదేలైంది. ఒకప్పుడు రిలీజ్ అంటేనే పండగలా జరిగే రవితేజ సినిమాలు ఇప్పుడు ఓపెనింగ్స్ డే రోజునే స్ట్రగుల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో రవితేజకి ఇప్పుడు తప్పనిసరిగా ఒక సూపర్ హిట్ కావాలి. ఈ నేపధ్యంలో రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు దింపుతున్నారు రవితేజ.
వాటిల్లో మొదటి సినిమా మాస్ జాతర. ఆగస్టు 27న గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ఈ మూవీ, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు టీమ్ స్పీడ్ పెంచి అక్టోబర్ ఎండ్ రిలీజ్ ఫిక్స్ చేసింది. లాక్ చేసిన డేట్ అక్టోబర్ 31 . అంటే దీపావళి హంగామా ముగిసిన వెంటనే మాస్ ఎంటర్టైనర్ తో రవితేజ భాక్సాఫీస్ బరిలోకి దూకుతున్నారు.
ఇది అయిన వెంటనే రవితేజ నెక్ట్స్ మూవీ RT76 (దర్శకుడు కిశోర్ తిరుమల) కూడా పెద్ద ప్లాన్‌తో వస్తోంది. నవంబర్‌లోనే మొత్తం షూట్ పూర్తి చేసి, సంక్రాంతి 2026 లో థియేటర్లలోకి తీసుకురావడమే టార్గెట్ పెట్టుకున్నారు. అంటే రవితేజకి రెండు నెలల్లో రెండు భారీ రిలీజ్‌లు ఉన్నాయి. అక్టోబర్ చివర్లో మాస్ జాతర… జనవరిలో RT76.
కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. సంక్రాంతి రేసు ఇప్పటికే హాట్‌గా ఉంది. చిరంజీవి మన శంకర్ వర ప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజా సాబ్ లాంటి బిగ్ టికెట్ మూవీస్ రేసులో ఉన్నాయ్. వీటితో పోటీ అంటే రవితేజ మూవీకి భారీ రిస్క్. బాక్సాఫీస్ వాతావరణం బట్టి మరో డేట్‌కి షిఫ్ట్ చేస్తేనే లాభమని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
మాస్ జాతర విషయానికి వస్తే..ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక పక్కా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్‌గా టాక్. మరోవైపు RT76 లో కిశోర్ తిరుమల, రవితేజకు మాస్–ఫ్యామిలీ కలయికను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని టాక్.