ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ బాగా పాపులర్ అయిపోయింది — రీ రీలజ్ లు. పాత బ్లాక్‌బస్టర్ సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేసి, అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ ట్రెండ్ ముందుకెళ్తోంది. ముఖ్యంగా స్టార్స్ పుట్టినరోజు సందర్భాల్లో సినిమాల రీ-రిలీజ్ లు ఓ సెంటిమెంట్‌గా మారింది.
ఈ ఆగస్ట్ నెలలో ఈ హవా మరింత గట్టిగానే వీచబోతుంది.
ఆగస్ట్ బర్త్‌డే రీ-రిలీజ్ లు :
అతడు – ఆగస్ట్ 9: మహేశ్ బాబు అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్. ఇది ఆయన 50వ పుట్టినరోజు మాత్రమే కాదు, ఆయన కెరీర్‌లో మోస్ట్ బిలవెడ్ సినిమా ‘అతడు’ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. రీ-రిలీజ్ లు రికార్డులన్నీ బ్రేక్ చేయబోతుందనే అంచనాలు ఉన్నాయి.
స్టాలిన్ – ఆగస్ట్ 22: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున, ‘స్టాలిన్’ మళ్లీ సందడి చేయబోతుంది. ఎమోషనల్ కాన్సెప్ట్‌తో సాఫ్ట్ మాస్ మూవీగా పేరున్న ఈ సినిమా మళ్లీ అభిమానుల గుండెను తాకబోతుంది.
రగడ – ఆగస్ట్ 29: కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘రగడ’ మరోసారి తెరపైకి వస్తోంది. ఫ్యాన్స్‌కి ఇది నోస్టాల్జియా జర్నీగా ఉంటుంది.
అదే సమయంలో కొత్త సినిమాల పోటీ:
వార్ 2 vs కూలీ – ఆగస్ట్ 14: భారీ స్థాయిలో వచ్చే రెండు చిత్రాలు, యాక్షన్ మరియు మాస్ కమర్షియల్ సినిమాల మధ్య పక్కా క్లాష్ ఉండబోతోంది.
కింగ్‌డమ్ – ఆగస్ట్ 1 లేక జూలై 24?: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ ఇంకా క్లారిటీ లేని పరిస్థితిలో ఉంది. అయినా అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
మాస్ జాతర – ఆగస్ట్ 27: రవితేజ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ చివరి వారం ప్రేక్షకుల మీద తన మార్క్ వేసే ప్రయత్నం చేస్తోంది.
ఫైనల్ గా…
ఈ ఆగస్ట్ నెలలో తెలుగు ప్రేక్షకులకు పాత సినిమాల నోస్టాల్జియా, కొత్త సినిమాల కొత్త అనుభవం – రెండూ ఒకేసారి దొరకబోతున్నాయి. మొత్తానికి ఈ రీ-రిలీజ్ లు ట్రెండ్ ఇప్పుడు తెలుగు సినీ సంస్కృతిలో భాగం అవుతోంది.
అతడు రికార్డులు తిరగరాస్తుందా? స్టాలిన్ మళ్లీ మాస్‌ను ఊపేస్తుందా? రగడకు మళ్లీ రెచ్చిపోయే రీస్పాన్స్ వస్తుందా? చూద్దాం