‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం ‘సామజవరగమన’ . ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2023, జూన్ 29న రిలీజ్ అయ్యింది. మార్నింగ్ షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ తర్వాత సూపర్ హిట్టైంది. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది.
శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు కలసి ఈ కొత్త కామిక్ ఎంటర్టైనర్ కోసం చర్చలు కొనసాగిస్తున్నారు. రామ్ అబ్బరాజు ఇప్పటికే “సామజవరగమన సీక్వెల్” స్క్రిప్ట్ ని రివీల్ చేశారు, శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ బ్యాంక్ చేస్తుండగా, శ్రీవిష్ణు ప్రస్తుత ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత షూట్ ప్రారంభం అవుతుంది.
రామ్ అబ్బరాజు, భాను, నందు వంటి తన రైటర్స్ టీమ్‌తో కలిసి సీక్వెల్ స్క్రిప్ట్‌పై already పనిచేస్తున్నారు. ప్రస్తుతం రామ్ “నారి నారి నడుమ మరారి” షూట్ పూర్తి చేసి, తర్వాత పూర్తిగా సామజవరగమన సీక్వెల్ మీద దృష్టి పెట్టనున్నారు. ఆఫీషియల్ అన్‌నౌన్స్‌మెంట్ త్వరలో రాబోతోంది!
ఈ సీక్వెల్ మళ్లీ ఆడియన్స్ ను స్మైల్ & లాఫ్‌లతో ఉర్రూతలూగిస్తుందా అని ఫ్యాన్స్ అంచనాలు ఆల్రెడీ మొదలు అయ్యాయి!