ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాలో కీలకమైన పాత్ర ఛాన్స్ దొరికితే చెప్పేదేముంది పండుగే. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అంటే దేశం మొత్తం మోత మ్రోగిపోతుంది. ఆ ఛాన్స్ కొట్టేసింది మరెవరో కాదు టొవినో థామస్‌ (Tovino Thomas).

సూపర్‌హీరో చిత్రం ‘మిన్నల్‌ మురళి’ సహా, ‘2018’, ‘ఎ.ఆర్‌.ఎమ్‌’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటు టొవినో థామస్‌ (Tovino Thomas).

ఎన్టీఆర్‌ (NTR) సినిమాలో కీలకమైన పాత్రలో కనిపిస్తారో నటించేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం . ఆయన, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్‌ నటిస్తున్నారు.

పీరియాడిక్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

‘దేవర’ తర్వాత ఎన్టీఆర్, ‘సలార్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ కలిసి చేస్తున్న ఈసినిమాపై పాన్‌ ఇండియా స్థాయిలో అంచనాలున్నాయి.

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కించిన ‘సలార్‌’తో (Salaar) మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ని తెలుగు తెరపైకి తీసుకొచ్చారు ప్రశాంత్‌ నీల్‌. ఆయనకు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే.

, ,
You may also like
Latest Posts from