‘ఓజీ’ వేవ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఈ క్రేజ్ మధ్య పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఒక షాకింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయనకు జ్వరం, శరీర నొప్పులు ఎక్కువవడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఇది వైరల్ ఫీవర్ అని తేలింది. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్‌.. అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించిన వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో జ్వరంతో ఇబ్బందిపడుతూనే శాఖాపరమైన అంశాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.

ఇదిలా ఉంటే, రేపట్నుంచే ‘ఓజీ’ వరల్డ్‌వైడ్ ప్రీమియర్ మొదలుకానుంది. ఈ రాత్రి 10 గంటల నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో పేడ్ ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా, గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లో 6 గంటలకే, తెలంగాణలో 7:30 గంటలకు ఫస్ట్ షోలు కిక్‌స్టార్ట్ అవుతాయి.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ కోసం రికార్డ్ చేసిన వీడియో ఇంటర్వ్యూలను మినహాయించి, ‘ఓజీ’ కోసం కొత్త ప్రమోషన్లలో పాల్గొనటంలేదు. మూవీ మీద ఉన్న బజ్, అభిమానుల క్రేజ్‌తోనే సరిపోతుందని ఆయన నమ్మకం. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల కారణంగా మీడియా మీట్‌లను కూడా స్కిప్ చేస్తున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from