నందమూరి బాలకృష్ణ (Bala Krishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku maharaj) మూవీ విడుదల రోజు ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఏపీలో బెనిఫిట్ షోలకు థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ రచ్చ చేసారు. ఇక తిరుపతిలో అయితే బాలయ్య అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాలయ్య కటౌట్ కు మెన్షన్ హౌస్ తో అభిషేకం చేసి.. పొట్టేలును బలిచ్చారు. టెంకాయలు కొడుతూ డాన్స్ చేస్తూ టపాసులు కాలుస్తూ హడావిడి చేశారు.
అయితే అలా చేసిన నందమూరి అభిమానులపై కేసు నమోదు అయింది. బాలకృష్ణ (Bala Krishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమా థియేటర్ వద్ద బహిరంగంగా జంతుబలికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్సై బాలకృష్ణ (Tirupati) వివరాల మేరకు.. ఈనెల 12వ తేదీ రాత్రిన కొందరు అభిమానులు పొట్టేలును థియేటర్ వద్దకు తీసుకొచ్చి బలిచ్చి.. దాని రక్తం సినిమా పోస్టర్‌పై చల్లారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా కావడం, స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణ కేసు నమోదుకు ఆదేశించారు.
వీడియోను పరిశీలించి ఆర్‌సీపురం మండలం మచ్చారెడ్డిపల్లికి చెందిన శంకరయ్య, తిరుపతి కొర్లగుంటకు చెందిన రమేష్, చింతామణికి చెందిన సురేష్‌రెడ్డి, బంగారు పాళెంకు చెందిన ప్రసాద్, పల్లెపట్టుకు చెందిన లోకేష్ బాబుగా గుర్తించారు. వారిపై జంతు చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
యువ దర్శకుడు బాబి కొల్లి తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుంటుంది. బాలయ్య కు జోడిగా శ్రద్ధ శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశీ రౌతులా కనిపించారు.
కథని మలుపు తిప్పే పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ కనిపించినప్పటికీ, ప్రజ్ఞా జైస్వాల్ నిడివి ఎక్కువగా ఉంది. ఇక ఊర్వశీ రౌతులా దబిడి దబిడి పాటతో సినిమాకే సరికొత్త అందాన్ని తీసుకొచ్చేసింది.