శేఖర్ కమ్ముల సినిమాలకి అమెరికాలో ఎప్పుడూ ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫిదా, లీడర్ వంటి సినిమాలు US బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ‘కుబేరా’ ఆయన కెరీర్లోనే USAలో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది!
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ వీక్ నుంచే అదిరిపోయే బుక్కింగ్స్తో దూసుకెళ్లింది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు చూస్తే, కుబేరా ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమాల్లో అమెరికాలో టాప్‌లోకి వచ్చేసింది.
‘ఫిదా’ రికార్డును బ్రేక్ చేస్తూ, నాగార్జునకు, ధనుష్‌కు మొదటి $2 మిలియన్ గ్రాసర్‌గా నిలిచిన సినిమా ఇదే.
ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా, ఫుల్ రన్లో $2.5 మిలియన్ దాటి పోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’ రిలీజైనా కూడా, ‘కుబేరా’కి సెకండ్ వీకెండ్లో స్టడీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
సింపుల్‌గా చెప్పాలంటే — కుబేరా = కమ్ములకు కరెక్ట్ కమ్‌బ్యాక్!