రజనీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “కూలీ” సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ హైప్‌కి కొంత ‘లీక్ షాక్’ ఎదురైందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది… కారణం – అక్కినేని నాగార్జున!
నాగార్జున కామెంట్స్‌తో సర్ప్రైజ్ ప్లాన్ ఢమాల్?
సౌత్ సినిమాల అభిమానులు ‘కూలీ’లో నాగార్జున ఏ పాత్రలో కనిపిస్తారో ఊహించలేక ఉత్సాహంగా ఎదురుచూస్తుండగా, నాగ్ స్వయంగా ఇంటర్వ్యూలో “నేను విలన్” అని ఠక్కున చెప్పేసారు!
“This was super fun! It’s totally different from my earlier films. I play the main villain, and most of my scenes are with Rajinikanth sir. It’s him versus me.” – అని నాగార్జున తానే క్లారిటీ ఇచ్చేశారు.
ఇంతవరకూ చిత్ర టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, నాగ్ మాటలతో అంతా బయటపడిపోయింది. దీంతో రజనీ వర్సెస్ నాగ్ కాంబినేషన్‌కు ఉన్న సస్పెన్స్ పూర్తిగా ఆవిరైపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఆమిర్ ఖాన్ పాత్ర గురించి కూడా లీక్?
నాగ్ తన పాత్ర గురించి చెప్పడమే కాదు, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గురించి కూడా కొన్ని హింట్లు ఇచ్చేశారు.
“I don’t have scenes with Aamir Khan—we belong to two different tracks. But I saw his portions later, and you’ll be shocked. He’s brilliant in it!”
అంటే సినిమాలో ఆమిర్ & నాగ్ ట్రాక్స్ వేరు అనేది కూడా కన్ఫర్మ్ అయింది. ఇది ప్రేక్షకులకు థియేటర్‌లో షాక్ ఇవ్వాల్సిన సన్నివేశం అయ్యుండేది… కానీ నాగ్ ముందుగానే రివీల్ చేశారు!
త్వరలో ‘కూలీ’ టీం నుంచి కన్‌ఫర్మ్డ్ అప్‌డేట్ వస్తుందా?నాగార్జున కామెంట్స్‌తో కొంత క్లారిటీ వచ్చినా, మూవీ యూనిట్ నుంచి అధికారిక స్టేట్‌మెంట్ రాలేదు. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో వారు ఓ స్పెషల్ పోస్టర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేస్తారా? అనేది ఆసక్తికర ప్రశ్న.