నితిన్ హీరోగా, దిల్ రాజు బ్యానర్‌పై తెరకెక్కిన “తమ్ముడు”… ఓ డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందనుకున్నారు. కానీ రిలీజ్‌ తర్వాత ఎవ్వరు ఊహించని విధంగా, బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలపడిపోయింది. సాధారణంగా ఫ్లాప్ సినిమాలు అయినా ఓపెనింగ్ వీకెండ్ వరకు ఏదో రకంగా పోటీ ఇస్తాయి. కానీ తమ్ముడు అయితే, తొలి షో నుంచే బిచాణా దిద్దేసింది.

రిలీజ్ తర్వాత నిర్మాతల టీమ్ పూర్తిగా మౌనవ్రతం పట్టింది. పోస్టు రిలీజ్ ఇంటర్వ్యూలు, సక్సెస్ మీట్లు… ఏమీ జరగలేదు. దిల్ రాజు టీం నుంచి ప్రోమోషనల్ ట్వీట్లు కూడా లేవు. ఇండస్ట్రీలో ఇదొక అరుదైన సీన్. సాధారణంగా ఏదైనా డిజాస్టర్ అయినా, మినిమమ్ డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ తమ్ముడు విషయంలో పూర్తిగా చేతులెత్తేశారు.

ఈ షాక్ వేవ్స్ ఇప్పుడు వాళ్ల తదుపరి భారీ ప్రాజెక్ట్‌ మీదకి చేరిపోయాయి — అదే “ఎల్లమ్మ”.

బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఓ పీరియడ్ రూరల్ ఎమోషనల్ డ్రామా. మొదట నాని ఈ స్క్రిప్ట్ విన్నాడట. కానీ డేట్స్ కుదరక ఓకే చెప్పలేదట. ఆ తర్వాత కథ నితిన్ చేతికి వచ్చింది. తమ్ముడు విజయవంతం అయితే ఎల్లమ్మ కు ఫైనాన్షియల్ హైప్ వచ్చేస్తుందనుకున్న ప్రొడ్యూసర్లు… ఇప్పుడు దానికి రీ-స్క్రిప్టింగ్, బడ్జెట్ కట్, ఓటీటీ రిలీజ్ ఆప్షన్ వంటి మళ్లీ మొదటి నుండి ఆలోచనలు మొదలెట్టారు.

హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరుతో చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన లేదు. కానీ ఆమె కెరీర్ కూడా ఇంతే దారిలో ఉంది. భోళా శంకర్, బేబీ జాన్, సైరన్, రఘు తత్తా, ఉప్పు కప్పురంబు వంటి వరుస ఫ్లాప్స్ తో, ఆమెకు కూడా ఈ సినిమా బాగా అవసరమే.

మరోవైపు నితిన్ పరిస్థితి మరింత దారుణం. భీష్మ తర్వాత చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా-ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు వంటి వరుస ఫెయిల్యూర్స్ తో, ఇప్పుడు ఎల్లమ్మ నితిన్ కెరీర్‌లో “డూ-ఆర్-డై” మూమెంట్ లా మారింది. ఈ సినిమా కూడా నిరాశపరిస్తే… నితిన్‌ని బాక్సాఫీస్ హీరోగా నమ్మే వాళ్లే ఉండకపోవచ్చు.

ఈ సారి కంటెంట్ హిట్ ఇవ్వకపోతే… కామెడీ, మాస్ మాస్ అనే ముసుగు వేసుకున్న కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు దిల్ రాజు టీమ్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు —
ఎల్లమ్మని నితిన్ తో చేయాలా వద్దా?

, , , , , ,
You may also like
Latest Posts from