ఒక జమానాలో, విజయ్ దేవరకొండ పేరు వెళ్తేనే యూత్ థియేటర్స్ కు పరుగెత్తిన పరిస్థితి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై పెద్ద ప్రభావం చూపించాయి. తాజాగా వచ్చిన కింగ్డమ్ కూడా అదే లైన్‌లోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు అతని ప్రాజెక్టుల మీద మార్కెట్ నమ్మకాన్ని కోల్పోతుంది. ఈ నేపథ్యంలో, ఆయన తదుపరి సినిమా బడ్జెట్ పై భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

మైత్రీ మూవీమేకర్స్‌తో విజయ్ – పెండింగ్ ప్రాజెక్ట్‌కు బ్రేక్!

మైత్రీ మూవీమేకర్స్‌కి విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. మొదట ఒక ప్రాజెక్ట్ అనుకుంటే వేరే రీజన్స్ తో ఆగిపోయింది. దానికి బదులుగా మరో సినిమా చేసేందుకు విజయ్ ముందుకొచ్చాడు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు.

అయితే, ఆ సమయంలో ఓటీటి మార్కెట్ మంచి స్థాయిలో ఉండటంతో, పెద్ద బడ్జెట్ ఓకే అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విజయ్ దేవరకొండ సినిమా అంటే హై బజ్ అనే రోజులు పోయాయి. బాక్సాఫీస్ ఫలితాలు డల్ అయ్యిపోవటంతో, నాన్-థియేట్రికల్ హక్కుల ధర కూడా పడిపోయింది. దీంతో మైత్రీ మూవీమేకర్స్ బడ్జెట్ రీ-విజన్‌కు వెళ్లారని ట్రేడ్ సమాచారం.

రాహుల్ టీం కు షాక్ – బడ్జెట్ కట్, రెమ్యునరేషన్ డిస్కషన్స్!

ప్రస్తుతం డైరెక్టర్ రాహుల్ సంకృత్యాయన్‌ టీం స్క్రిప్ట్‌ను, మేకింగ్ స్ట్రాటజీని బడ్జెట్‌కు తగ్గట్టుగా మార్చే పనిలో ఉంది. సినిమా లాంచ్ వాయిదా పడిన కారణం కూడా ఇదే. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది కానీ ఇప్పటివరకు నటీనటుల రెమ్యునరేషన్‌పై కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా కనిపించనుంది. విజయ్ దేవరకొండ కొత్త గెటప్‌లో, డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ప్రిపరేషన్‌లో ఉన్నారు.

ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక వివరాలు బయటకురాలేదు కానీ… మైత్రీ వంటి పెద్ద బ్యానర్ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, విజయ్ దేవరకొండ మార్కెట్ స్టామినా ఏమేరకు తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పీరియాడిక్ మూవీ తిరిగి విజయ్‌కి క్రేజ్ తీసుకురావడంలో ఎంతవరకు దోహదపడుతుంది అనేది చూడాల్సిందే.

, , , ,
You may also like
Latest Posts from