హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వార్ 2 ఆగస్ట్ 14న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రెండ్ అవుతుండగా, హిందీ వర్షన్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని రోజుల కిందటే మొదలయ్యాయి. యాక్షన్, మాస్ ఎంటర్టైన్‌మెంట్, స్టార్స్ కాంబినేషన్‌తో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ మరింత పెరిగింది.
అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రంలో కియారా అద్వాణీపై తీసిన బికినీ సీన్‌ను తొలగించిందని సమాచారం. దీంతో కొంతమంది అభిమానులు, సినిమా ప్రియులు నిరాశ చెందారు. మొదట ఈ మూవీ రన్‌టైమ్ 179 నిమిషాలుగా లాక్ చేయబడింది. కానీ తాజాగా 6 నిమిషాలు 25 సెకన్ల ముఖ్యమైన ఫుటేజ్‌ను తొలగించి కొత్త సెన్సార్ సర్టిఫికేట్‌కు అప్లై చేశారని తెలుస్తోంది.
ఈ కట్స్‌లో హృతిక్ – ఎన్టీఆర్‌ల మధ్య జరిగే కీలక యాక్షన్ సీక్వెన్స్‌లు, అలాగే క్లైమాక్స్‌లో ఉన్న కొన్ని సన్నివేశాలు కూడా ఉండొచ్చని టాక్. అవి కథలోని ట్విస్ట్‌లను బహిర్గతం చేసే అవకాశం ఉండటంతో తొలగించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
లావిష్ బడ్జెట్‌తో యాష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అయాన్, రెండో భాగంలో ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయని హింట్ ఇచ్చారు.