జూన్ 27న థియేటర్లలో రిలీజ్ అయిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, మోహన్ బాబు, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించిన ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్స్ రాలేకపోయినా, విజువల్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

దాంతో చాలా మంది థియేటర్స్ లో చూడని వారు ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

అఫీషియల్ ఎనౌన్సమెంట్

మంచు విష్ణు లేటెస్ట్‌గా ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం, ‘కన్నప్ప’ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

అంటే మరో కొన్ని రోజుల్లోనే ఇంట్లో కూర్చునే ఈ విజువల్ వండర్‌ని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది!

OTTలో మిస్ అవ్వొద్దు!

థియేటర్లలో మిస్ అయ్యిన వాళ్లకి, మళ్లీ ఆ మేజిక్ ఫీలవ్వాలనుకునే వాళ్లకి… సెప్టెంబర్ 4 నుంచి ప్రైమ్ వీడియోలో ‘కన్నప్ప’ అందుబాటులోకి రానుంది.

కథేంటి

పరమ నాస్తికుడుగా పెరిగిన తిన్నడు (మంచు విష్ణు) జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన తండ్రి నాథ నాథుడు (శరత్‌ కుమార్‌) మాటకు విలువ ఇచ్చే తిన్నడు, గూడెం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడెం యువరాణి నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ క్రమంలో గూడెంను వీడాల్సి వస్తుంది.

నెమలితో కలిసి అడవికి వెళ్తాడు తిన్నడు. నెమలి శివ భక్తురాలు కాగా, తిన్నడు మాత్రం శివుడిని నమ్మని నాస్తికుడు. అటువంటి తిన్నడి జీవితంలోకి రుద్ర (ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడికి పరమ భక్తుడైన కన్నప్పగా ఎలా మారాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

, , , , , ,
You may also like
Latest Posts from