పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG (They Call Him OG) ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. ప్రీమియర్ షోస్‌తోనే ఈ సినిమా $3,138,337 (దాదాపు 26 కోట్లు) వసూలు చేసి, అక్కడి తెలుగు సినిమాల చరిత్రలో నాలుగో అతిపెద్ద ప్రీమియర్ కలెక్షన్‌గా నిలిచింది.

ఇదే వేగం కొనసాగుతూ, రెండో రోజుకల్లా మరో మిలియన్ దాటేసి, ప్రస్తుతం క్యూమిలేటివ్ గ్రాస్ $4 మిలియన్ చేరింది. ట్రేడ్ అంచనాల ప్రకారం, లాంగ్ వీకెండ్ ముగిసే సరికి ఈ సంఖ్య $5–5.5 మిలియన్ దాకా వెళ్లే అవకాశం ఉంది. ట్రెండ్ ఇలాగే కొనసాగితే మరింత సెన్సేషన్ ఖాయం!

గమనించదగ్గ విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గతంలో ఉత్తర అమెరికాలో సాధించిన బెస్ట్ రికార్డు అజ్ఞాతవాసిది ($2.02M). ఆ సినిమా పెద్ద ఓపెనింగ్ ఇచ్చినా, అక్కడే ఆగిపోయింది. కానీ OG మాత్రం ప్రీమియర్స్‌తోనే ఆ రికార్డును దాటేసి, పవన్ కెరీర్‌లోనే కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.

ఉత్తర అమెరికా తెలుగు సినిమాల ప్రీమియర్ షో టాప్ 5

కల్కి 2898 AD – $3.9M

RRR – $3.5M

పుష్ప 2 – $3.3M

OG – $3.1M

దేవర – $2.8M

సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా, ఎక్కువ ప్రమోషన్స్ లేకపోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్, అంచనాలతోనే ఓవర్సీస్‌లో ల్యాండ్‌మార్క్ హిట్‌గా దూసుకెళ్తోంది.

, , , , ,
You may also like
Latest Posts from