
పవన్ కళ్యాణ్ ‘OG’ బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. విడుదలైన 8 రోజుల్లోనే 260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఇప్పుడు రెండో వీకెండ్ లోకి అడుగుపెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – ఈరోజు నూన్ షోస్ నుంచే మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది.
ఈ వీకెండ్‌లో కనీసం 25 కోట్ల వసూళ్లు దక్కితే, మొత్తం కలెక్షన్స్ 290 కోట్లకు దగ్గరగా చేరే అవకాశం ఉంది. వీకెండ్‌కల్లా 285 కోట్ల మార్క్ దాటితే, 300 కోట్ల మైలురాయి అందుకోవడం OGకి చిన్న విషయం అవుతుంది.
2025లో ఇప్పటివరకు ఎటువంటి తెలుగు సినిమా 300 కోట్ల గ్రాస్‌ను తాకలేదు. కానీ పవన్ కళ్యాణ్ ‘OG’ కేవలం 8 రోజుల్లోనే 260 కోట్లను రాబట్టి, ఈ ఏడాది అగ్రగామి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ యాక్షన్ డ్రామా 300 కోట్ల మైలురాయి చేరితేనే బాక్సాఫీస్ వద్ద అధికారిక హిట్ స్టేటస్ దక్కనుంది.
మరి పవన్ కళ్యాణ్ OG 300 కోట్ల రికార్డును క్రియేట్ చేస్తుందా? లేక బాక్సాఫీస్ గేమ్ చివరి వరకు ఉత్కంఠగా మారుతుందా?
