
అడివి శేష్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుంది! మొదటగా డిసెంబర్ 25న విడుదల కానున్నట్టు ప్రకటించిన ఈ సినిమా షూటింగ్‌లో ఆలస్యం కావడంతో, విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా రిలీజ్ వాయిదా వేసిందని టీమ్ ప్రకటించింది. షనీల్ దియో దర్శకత్వం వహిస్తుండగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి కానీ… ఈ క్రిస్మస్ మాత్రం మిస్ అయింది.
అయితే ఆసక్తికర ట్విస్ట్ ఏంటంటే — శేష్ ఔట్ అయిన చోట రోషన్ ఇన్!
‘పెళ్లి సందD’ తర్వాత గ్యాప్ తీసుకున్న రోషన్, భారీ స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్’ తో మళ్లీ రంగంలోకి దిగాడు. ఈ చిత్రాన్ని ప్రదీప్ అధ్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లపై, సి. అశ్వినీ దత్ – జెమిని కిరణ్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మిక్కీ జే మేయర్ సంగీతం, మాధి సినిమాటోగ్రఫీతో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ నాడు — డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అంటే ఇక ఈ క్రిస్మస్‌కి తెలుగు బాక్సాఫీస్ ‘చాంపియన్’ ఒంటరిగా దూసుకుపోనుంది!
శేష్ తప్పుకున్న రేస్‌లో రోషన్ చాంపియన్ అవుతాడా?
ఇండస్ట్రీలో ఇప్పుడు అదే హాట్ టాపిక్!
