బాలీవుడ్‌లో వయస్సుతో సంభందం లేకుండా ఫుల్ ఎనర్జీతో కనిపించే సీనియర్ హీరో అనిల్ కపూర్. 60+ ఏళ్లు దాటినా స్టైల్, స్వాగ్, స్పీడ్ తగ్గలేదు. “యానిమల్” తర్వాత మన తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యాడు.
కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన కెరీర్ అసలు టాలీవుడ్ నుంచే స్టార్ట్ అయింది .
1980లో బాపు డైరెక్షన్‌లో వచ్చిన వంశవృక్షం సినిమాతో సొలో హీరోగా మొదలుపెట్టాడు. కానీ సినిమా ఫెయిల్ కావడంతో ఇక్కడి డైరెక్టర్లు ఆయనని ఇగ్నోర్ చేశారు. అప్పుడు ముంబైకి వెళ్లి అక్కడే బ్లాక్‌బస్టర్లు కొట్టి, ఖాన్లకు టఫ్ కాంపిటేషన్ ఇచ్చాడు.
మళ్లీ ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్ మళ్లీ తెలుగులోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడని టాక్!
వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య హీరోగా వస్తున్న ఎంటర్‌టైనర్‌లో ఆయనకు కీలక పాత్ర కోసం అప్రోచ్ అయ్యారట.
ఇది కేవలం డబ్బింగ్ కాదు బై-లింగువల్ (తెలుగు + తమిళం) ప్రాజెక్ట్.
అంటే ఇదే ఆయన అసలు “రీ-ఎంట్రీ” గా లెక్క!
సూర్య + అనిల్ కపూర్ కాంబినేషన్ స్క్రీన్ మీద ఇంపాక్ట్ ఊహించుకోండి!
నార్త్‌లో కూడా హైప్ పెరిగిపోతుంది.
సూర్య “కరుప్పు” పూర్తి చేసేశాక ఇప్పుడు మొత్తం ఫోకస్ ఈ సినిమా మీదే.
2026 సమ్మర్ ని టార్గెట్ చేస్తూ సితార ఎంటర్‌టైన్మెంట్స్ మాస్ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తోంది.
అయితే ట్విస్ట్ ఏంటంటే – అనిల్ కపూర్ డేట్స్ అడ్జస్ట్ అవుతాయా లేదా అన్నది ఇంకా సస్పెన్స్.
అవును అంటే టాలీవుడ్‌లో నిజమైన రిటర్న్ ఆఫ్ ఎ లెజెండ్!