OG ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓవర్సీస్ రికార్డుల్ని సునాయాసంగా దాటేసింది. ఉత్తర అమెరికాలోనే ప్రీమియర్ షోస్‌తో $3.1M వసూలు చేసి, ప్రస్తుతం $4M దాటేసింది. లాంగ్ వీకెండ్ ముగిసే సరికి $5–5.5M దాకా వెళ్లేలా ట్రెండ్ కనపడుతోంది.

ఇక ఇండియాలో కూడా ఆరంభం హౌస్‌ఫుల్ షోలు, రికార్డ్ బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో హంగామా చేస్తోంది. మొత్తానికి, OG పవన్ ఫ్యాన్స్‌కే కాదు, మొత్తం ట్రేడ్ సర్క్యూట్‌కీ గేమ్‌చేంజర్ గా మారింది!ఈ నేపధ్యంలో దర్శకుడు సుజీత్ ఓ ఇంట్రస్టింగ్ సీక్రెట్ బయటపెట్టాడు.

“సాహో” ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తనకు తర్వాత రామ్ చరణ్ సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పాడు. అది పూర్తిగా లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేసిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కావాల్సి ఉండేది. కానీ కరోనా దెబ్బతో ఆ ప్రాజెక్టు సాకారం కాలేదు.

ఆ తర్వాత మెగా కాంపౌండ్‌లో మళ్లీ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఆఫర్ వచ్చిందట. అసలు పవన్‌తో సినిమా చేసే అవకాశాన్ని వదిలేశాననుకున్నానని, ఎందుకంటే మొదట రీమేక్ ప్రపోజ్ చేయగా తానే నో చెప్పేశానని, ఆ తర్వాత ఇక ఛాన్స్ మిస్ అయిపోయిందనుకున్నానని చెప్పాడు సుజీత్. కానీ, అలా కాకుండా, మరో కథ ఉంటే వినిపించమని అడగడం… వెంటనే OG ఓకే కావడం… అన్నీ చకచకా జరిగిపోయాయంట.

‘OG’ కథను తాను పొడిపొడిగా మాత్రమే చెప్పానని పవన్ చెప్పిన విషయంపై, సుజీత్ స్పందిస్తూ: “నేను ఎవరికైనా అలా మాత్రమే చెబుతాను. డీటెయిల్డ్‌గా స్టోరీ చెప్పడం నా స్టైల్ కాదు” అని క్లారిఫై చేశాడు.

, , , ,
You may also like
Latest Posts from