తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలంటే టికెట్ ధర పెంపు అన్నది క్యాజువల్ మేటర్ అయిపోయింది. తాజాగా ఆగస్ట్ లో రాబోతున్న రెండు భారీ సినిమాలు “వార్ 2” మరియు “కూలీ” కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల టీమ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు అధికారికంగా టికెట్ ధరలు పెంచేందుకు దరఖాస్తులు పంపినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో రెండు సినిమాలకు ఒకే టిక్కెట్ రేటు ఉండబోతోందా లేదా ఏ సినిమాకు, ఎక్కువ, తక్కువ ఉండబోతోంది,దాని భాక్సాఫీస్ ఛాన్స్ లు ఎక్కువ ఉంటాయనేది నిజం. అదే ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్.
పండగ వీకెండ్.. పెరిగిన ధర.. పెరిగిన ఒత్తిడి!
టికెట్ ధర పెంపు హైప్ ఉన్న సినిమాలకు ప్లస్ అయినా, మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం బూమరాంగ్ అవ్వొచ్చు. కానీ ఈ రెండు సినిమాలు కూడా ఫెస్టివల్ వీకెండ్ రిలీజవుతుండటం, ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే, ప్రీమియం టికెట్ ధరలు కూడా ప్రేక్షకులు చెల్లించేందుకు వెనకాడరు.
ఇక ఒకే రోజు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి చిత్రాలు విడుదల అవుతూండటంతో రచ్చ ఓ రేంజిలో ఉంది. దీంతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కూలి Vs వార్ 2 ఫైట్ కొనసాగుతోంది. వరల్డ్ వైడ్ గా ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రానికి భారీ రెస్పాన్స్ ఉందనేది ఆసక్తికరంగా మారింది.
కూలి x వార్ 2.. వరల్డ్ వైడ్ గా రజనీకాంత్ కూలి, జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 చిత్రాలకు వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఓకే రోజు విడుదల కాబోతుండటంతో ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తిని నెలకొల్పుతోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు చిత్రాల్లో కూలి చిత్రానికే భారీ రెస్పాన్స్ దక్కుతుందని విశ్లేషణ. మరోవైపు ఓవర్సీస్ లో నార్త్ అమెరికా, UK, గల్ఫ్ కంట్రీస్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2కి మొదటి ప్రాధాన్యత దక్కుతోందని తెలుస్తోంది.
మొత్తానికి…
వార్ 2 , కూలీ లాంటి భారీ మల్టీస్టారర్ సినిమాలకి టికెట్ హైక్ అనేది సెల్ఫ్ బూస్టింగ్ స్ట్రాటజీ. కానీ ఫలితం మాత్రం మొదటి రోజు టాక్ మీదే ఆధారపడి ఉంటుంది!