‘కాంతార’ మిస్టిక్ వరల్డ్ మళ్లీ తెరపైకి వచ్చింది… కానీ ఈ సారి మరింత శక్తివంతమైన రూపంలో! ‘కాంతార చాప్టర్ 1’ విడుదల రోజే ఆడియన్స్‌ని ఆధ్యాత్మికతలో ముంచేసి, బాక్స్ ఆఫీస్‌ను ఊచకోత కోశింది.

ఓపెనింగ్ డే గ్రాస్: ₹89 కోట్లకు పైగా (వరల్డ్‌వైడ్ షాకింగ్ కలెక్షన్స్)
బీఎంఎస్‌లో ఒక్క రోజులోనే 1.28 మిలియన్ టికెట్లు అమ్ముడై రికార్డు బద్దలు!
డే 2లో కూడా ప్రతి గంటకు 75K టికెట్లు సేల్ అవుతున్న అద్భుతం!

24 గంటల్లో ‘బుక్‌మై షో’లో 1.28 మిలియన్‌కిపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ పోర్టల్‌ వేదికగా ఈ ఏడాదిలో ఈ రేంజ్‌లో టికెట్లు సేల్‌ కావడం రికార్డు.

ఈ జాబితాలో.. తొలి స్థానంలో ‘పుష్ప 2’ (1.75 మిలియన్‌ టికెట్లు) నిలిచింది. రెండో సినిమా ‘కాంతార చాప్టర్‌ 1’, ఆ తర్వాత స్థానాల్లో జవాన్‌ (1.14 మిలియన్‌ టికెట్లు), కల్కి 2898 ఏడీ (1.12 మిలియన్‌ టికెట్లు) ఉన్నాయి. సగటు ప్రేక్షకుడితోపాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ఎన్టీఆర్‌, ప్రభాస్‌, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తదితర టాలీవుడ్‌ ప్రముఖులు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.

‘కాంతార చాప్టర్‌ 1’ కన్నడ చిత్ర పరిశ్రమ, భారతీయ సినీ రంగంలో బెంచ్‌మార్క్‌లాంటిదని కన్నడ హీరో యశ్‌ తాజాగా అభివర్ణించారు. నటులు, సాంకేతిక నిపుణులను ప్రశంసించారు. ‘కాంతార’, ‘కాంతార చాప్టర్‌ 1’లతో నటుడు, దర్శకుడిగా సత్తా చాటారు రిషబ్‌శెట్టి (Rishab Shetty). ఈ ప్రీక్వెల్‌ మూవీలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్ కాగా బాలీవుడ్‌ నటుడు గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.

రిషబ్ శెట్టి తన విజన్, ప్యాషన్, డివోషన్‌తో ఒక కల్ట్‌ను క్రియేట్ చేశాడు. తెరపై ఆయన ఎనర్జీ ఆడియన్స్‌ను గట్టిగా పట్టేసింది.

భారీ బడ్జెట్‌తో నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ – అద్భుత విజువల్స్‌తో మైండ్ బ్లో చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ మేకర్స్ విస్తృతమైన రిలీజ్ ఇవ్వడం కూడా కలెక్షన్లకు బూస్ట్ ఇచ్చింది.

ట్రేడ్ అనలిస్టుల మాటల్లో: ఇది కేవలం ఓపెనింగ్ కాదు… ఒక బాక్స్ ఆఫీస్ ఫెనామినాన్ ప్రారంభం మాత్రమే!
ఫ్యామిలీ ఆడియన్స్, అన్ని వయసుల వాళ్లూ ఈ దివ్య ఎపిక్‌కి రెస్పాండ్ అవుతున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from