అల్లు అర్జున్ రాబోయే ఐదు సంవత్సరాలు సరబడ సినిమాలకు ఓకే చేసేసుకున్నట్లు సమాచారం. పుష్ప 2 తర్వాత ఆయన తన సినిమాలు ఆచి,తూచి ఎంచుకుంటున్నారు. పవర్-ప్యాక్డ్ లైనప్ తో దూసుకువెళ్తున్నాడు. అల్లు అర్జున్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు అట్లీతో ఉంది . ప్రొడక్షన్ హౌస్‌కి సంబంధించి కొన్ని చర్చల కారణంగా అఫీషియల్ ప్రకటనకు సమయం తీసుకుంటోంది. అలాగే ఈ నెలలో ప్రతిదీ సెట్ అవుతుందని, AA-అట్లీ ప్రాజెక్ట్ యొక్క అఫీషియల్ ప్రకటన అల్లు అర్జున్ పుట్టినరోజున ఇవ్వబడుతుందని సమాచారం.

అట్లీ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ త్రివిక్రమ్‌తో కలిసి పని చేయనున్నారు. పుష్ప 2 నిర్మాతలు ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అలాగే రామ్ చరణ్‌తో సుకుమార్ చిత్రం పూర్తయిన తర్వాత, పుష్ప 3 సెట్స్‌పైకి వెళ్తుందని పేర్కొన్నారు.

అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం అట్లీ, త్రివిక్రమ్ సినిమాలని పూర్తి చేసిన తర్వాత అతను పుష్ప 3లో చేరతాడు. ఆ తర్వాత సందీప్ వంగతో సినిమా ఎనౌన్స్ చేస్తారు. ఈ సినిమాల మధ్య ఏదైనా గ్యాప్ వస్తే, అల్లు అర్జున్‌కి సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది దర్శకులతో చర్చలు జరుపుతున్నారు.

అల్లు అర్జున్ నెక్ట్స్ ఐదు సంవత్సరాల లైనప్ ఈ దర్శకులతో ఉంది: అట్లీ, త్రివిక్రమ్, సుకుమార్, సంజయ్ లీలా బన్సాలీ, సందీప్ వంగా. ఈ లైనప్‌లోని ప్రతి చిత్రానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసే అవకాశం ఉంది, ప్రతీ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం కూడా ఉంది.

,
You may also like
Latest Posts from