
స్టార్ హీరోలందరికీ అభిమానుల సపోర్ట్ ఉంటుంది కానీ, పవర్ స్టార్ విషయంలో అది ఒక ఎమోషన్, ఒక జోష్. సినిమా హిట్ అయ్యినా, ఫ్లాప్ అయ్యినా పట్టించుకోరు – ఆయన పేరు ఉంటే చాలు, బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. అదే జోష్ ఇప్పుడు ‘ఓజీ’ కి కనబడుతోంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ అనుకున్న స్దాయిలో జరగకపోయినా, బుకింగ్స్ మాత్రం రికార్డులు తిరగరాస్తున్నాయి. అభిమానుల తపన, సోషల్ మీడియాలో హడావిడి చూసి ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నారు.
35 కోట్ల ప్రీ-సేల్స్ ఇప్పటికే దాటింది!
సెప్టెంబర్ 21 (ఆదివారం) వరకు ప్రపంచవ్యాప్తంగా “ఓజీ” ప్రీ-సేల్స్ రూ.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వీటిలో ఓవర్సీస్ మార్కెట్ ప్రధాన పాత్ర పోషించింది (రూ.24 కోట్లు), ఇండియాలో మాత్రం రూ.11 కోట్లు వచ్చాయి.
ఫుల్ బుకింగ్స్ ఈరోజు నుంచే
ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎక్కువ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కానీ సెప్టెంబర్ 22 (సోమవారం) నుంచి పూర్తి స్థాయిలో బుకింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. ఫ్యాన్స్ క్రేజ్‌ని చూస్తూంటే రిలీజ్ కాకముందే థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
100 కోట్ల ప్రీ-సేల్స్ లక్ష్యం!
ట్రేడ్ ఎనలిస్టుల లెక్కల్లో చెప్పాలంటే – ఫస్ట్ డే షోలు పడేలోగా “ఓజీ” 100 కోట్ల ప్రీ-సేల్స్ దాటే అవకాశం ఉంది. అదే జరిగితే, తెలుగు సినిమా చరిత్రలోనే కొత్త మైలురాయి రికార్డు అవుతుంది.
మొత్తం మీద ఒక విషయం క్లియర్ – పవర్ స్టార్ అనే పేరు వినిపిస్తే ఫ్యాన్స్ ఎక్కడా తగ్గరు. అదే ఇప్పుడు ‘ఓజీ’కి అదిరిపోయే బాక్సాఫీస్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది.
