

రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ సినిమా ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రిలీజ్ రోజే భారీ హైప్‌తో మొదలైన ఈ సినిమా, రెండు వారాల్లోనే ₹510 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ‘వార్ 2’ బాక్సాఫీస్‌లో ఎదురొచ్చిన తర్వాత, సినిమా రన్ కొంతమేర తగ్గిపోయింది.
మిక్స్‌డ్ టాక్ వచ్చినా, రజనీకాంత్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఫ్యాన్స్ థియేటర్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సినిమా మీద ఉన్న ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది.
సెప్టెంబర్ 11 నుంచి ‘కూలీ’ దక్షిణాది భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.
హిందీ వెర్షన్ మాత్రం అక్టోబర్ మధ్యలో రానుంది. కారణం ఏమిటంటే – బాలీవుడ్ మల్టీప్లెక్సులలో ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో, అక్కడ 8 వారాల థియేట్రికల్ విండో రూల్ అమలులో ఉంది.
సినిమా బాక్సాఫీస్‌లో పాజిటివ్ టాక్ దక్కి ఉండి ఉంటే, ఈజీగా 800 కోట్ల దాకా , లేదా 1000 కోట్ల మార్క్ కూడా టచ్ అయ్యే అవకాశం ఉండేది అని ట్రేడ్ టాక్. కానీ లోకేష్ కనగరాజ్ నుండి ఫ్యాన్స్ ఆశించిన రేంజ్‌లో కిక్కు రాకపోవడంతో కొంత నిరాశ వ్యక్తమవుతోంది.
అయినా సరే – రజనీకాంత్ స్టార్డమ్ వల్ల కూలీకి థియేటర్స్‌లో కూడా, OTTలో కూడా మాస్ క్రేజ్ ఉంటుందనేది ఖాయం.