జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్లో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన “వార్ 2” బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవతూండటంతో, వెంటనే ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ నిజం ఏమిటంటే… ఆ అపోహలు తప్పించి ఏమీ లేదు!
నెట్‌ఫ్లిక్స్‌లో “వార్ 2” త్వరగా రాదు.
ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అయినందున, ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తుంది.
బాలీవుడ్లో multiplex chains – producers మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం, ఎనిమిది వారాల థియేట్రికల్ విండో పూర్తి కాకుండా సినిమా ఓటీటీలోకి వెళ్ళకూడదు. లేకపోతే మల్టీప్లెక్సుల్లో ప్రదర్శనకు అనుమతి ఉండదు.
కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించిన ఈ యాక్షన్ స్పై-డ్రామాకు సంగీతం ఇచ్చింది ప్రీతమ్. యాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం, YRF స్పైవర్స్ సిరీస్‌లో ఆరో సినిమాగా నిలిచింది. అయితే, గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లాగే ఈ సినిమాకూ ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు.
బాక్సాఫీస్‌లో దెబ్బతిన్నా… డిజిటల్లో “వార్ 2”కి మరో ఛాన్స్ ఉందేమో చూడాలి!