సోషల్ మీడియాలో, ఫిలింనగర్‌లో, ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా ప్రొడ్యూసర్ నాగ వంశి గురించే. వార్ 2 – కూలీ క్లాష్‌ నేపథ్యంలో ఆయన్నే ఎక్కువగా చర్చిస్తున్నారు. ఎన్టీఆర్‌కు హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌ అయిన నాగ వంశి, వార్ 2 తెలుగు హక్కులు కొనుగోలు చేశారు. కానీ ఆ సినిమా భారీ నష్టాల దిశగా వెళ్తుండటంతో బయ్యర్ల పరిస్థితి గందరగోళంగా మారింది.

బయ్యర్లకు ప్రొటెక్షన్ ఇచ్చే ప్రొడ్యూసర్

నాగ వంశి ప్రత్యేకత ఏంటంటే… తాను బయ్యర్లకు ఎప్పుడూ అండగా నిలుస్తాడు. తన సినిమాలు సక్సెస్‌ అయ్యాక కూడా, ఎక్కడైనా బయ్యర్లకు నష్టం జరిగితే వెంటనే కాంపెన్సేషన్‌ ఇస్తూ వారిని స్టాబిలైజ్‌ చేస్తాడు. అందుకే ఆయనను బయ్యర్లకు ‘సేఫ్ ప్రొడ్యూసర్’గా పిలుస్తున్నారు.

 వార్ 2  బయ్యర్లకు మాస్ జాతర బహుమతి?

ఇటీవల రిలీజ్‌ అయిన కింగ్‌డమ్ ఫ్లాప్ కావడంతో, అదే బయ్యర్లు వార్ 2 కోసం ఫుల్‌ పేమెంట్‌ చేయలేకపోయారు. అయినప్పటికీ, వంశి వారితోనే ముందుకు వెళ్లాడు. మరో ప్రొడ్యూసర్‌ అయితే సింపుల్‌గా ఫిల్మ్‌ని ఇతరులకు అమ్మేసేవాడు. ఇప్పుడు వార్ 2 డిస్ట్రిబ్యూషన్‌ భారీ నష్టాల్లోకి వెళ్లడంతో, నాగ వంశి మాస్ జాతర సినిమాను కాంపెన్సేషన్‌గా ఇవ్వబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

YRFతో డీల్?

అదే సమయంలో, వంశి యాష్‌రాజ్‌ ఫిలింస్‌ (YRF) టీమ్‌తోనూ చర్చలు జరుపుతున్నాడట. తెలుగు రాష్ట్రాల నష్టాలను దృష్టిలో ఉంచుకొని, వారూ కొంత శాతం కాంపెన్సేషన్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యారని టాక్ ఉంది.

ఇంత పెద్ద నష్టాల మధ్య నాగ వంశి చేసిన ఈ డీల్‌లు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజంగానే మాస్ జాతర బయ్యర్లకు ఊపిరి పోసేలా చేస్తుందా? లేక ఇది కూడా రిస్క్‌గా మారుతుందా అన్నది చూడాలి.

, , , , , , ,
You may also like
Latest Posts from