నార్త్– సౌత్ స్టార్ కాంబోస్ అంటేనే భారీ అంచనాలు! తెలుగు స్టార్‌లు తమ మార్కెట్‌ని ఇండియా మొత్తానికే కాక గ్లోబల్‌గా విస్తరించుకున్న తరుణంలో, బాలీవుడ్ కూడా వీరిని దగ్గర చేసుకోవాలని ప్రయత్నించింది. అదే ప్లాన్‌లో ఆదిపురుష్ వంటి సినిమాలు వచ్చి బోల్తా పడ్డాయి.

అయితే, అందరి దృష్టి వార్ 2 మీదే. హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబో అనగానే పాన్–ఇండియా ప్రేక్షకుల్లో క్రేజ్ పీక్స్‌కి చేరింది. “ఈ మూవీ హిట్ అయితే, ఇకపై నార్త్–సౌత్ కలబోత సినిమాలకు బంగారు బాట” అనే నమ్మకం కలిగింది. కానీ ఫలితం? దారుణం!

తెలుగు ప్రేక్షకులు మొదటి రోజునే వార్ 2 ని తిరస్కరించేశారు. కంటెంట్ బలహీనంగా ఉండటమే కాక, ఎన్టీఆర్ స్టార్డమ్ కూడా సరైన స్థాయిలో ఉపయోగించుకోలేదని ఫ్యాన్స్ మండి పడ్డారు. దాంతో ఈ కాంబినేషన్ అంతా ఫ్లాప్ టాక్‌లో కలిసిపోయింది.

ఫలితంగా—

డాన్ 3 , ధూమ్ 4 లాంటి బాలీవుడ్ ఫ్రాంచైజీలు కూడా తెలుగు స్టార్‌లకు ఆఫర్స్ ఇచ్చినా… వీరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తిరస్కరించేస్తున్నారు.

“తెలుగు ప్రేక్షకులను కోల్పోవడంకన్నా, బాలీవుడ్ మార్కెట్‌లో అడుగుపెట్టకపోవడమే మంచిది” అనేది స్టార్‌ల స్ట్రాంగ్ స్టాండ్ అయింది.
అలా చూసుకుంటే, ఒకే సినిమాతో ఉత్తర–దక్షిణ స్టార్ కాంబోలు గాలిలో కలిసిపోయినట్లే!

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాక్— “వార్ 2 తర్వాత ఇక స్టార్ కాంబోలు డెడ్!”
సినీ వర్గాల్లో ఇది పెద్ద కాంట్రవర్శీగా మారింది. నిజంగా ఇకపై బాలీవుడ్–టాలీవుడ్ కాంబినేషన్స్ కనిపించవా? లేక ఇంకో పెద్ద మూవీ ఈ equation‌ని మళ్లీ రీ–రైట్ చేస్తుందా?

, , , , , , ,
You may also like
Latest Posts from