పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన “They Call Him OG” తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్. థియేటర్లలో పవన్ ఎంట్రీతోనే ఫ్యాన్స్ పులకరించగా, బాక్సాఫీస్ వద్ద మాత్రం “OG” దూకుడు తుఫాన్లా మారింది.

వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే 200 కోట్ల మార్క్‌ దాటేసిన ఈ సినిమా, కేవలం అమెరికా నుంచే 45 కోట్లకు పైగా వసూలు చేసింది! అంటే, మొత్తం రన్‌లో దాదాపు 20–25% కలెక్షన్స్ యుఎస్ నుంచే వచ్చాయి — ఇది పవన్ కెరీర్‌లోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ కలెక్షన్ రికార్డు.

నార్త్ అమెరికాలో గ్రాస్ grossed $5.47 million (దాదాపు ₹45.5 కోట్లు) —
ఇందులో తెలుగు వెర్షన్‌ వసూళ్లు $5.43M,
హిందీ వెర్షన్‌ నుంచి $43K మాత్రమే.

అంటే OG హిందీలో పెద్దగా దూకుడు చూపించకపోయినా,
తెలుగు ఆడియెన్స్ మాత్రం మాస్-క్లాస్ మిక్స్‌కి పిచ్చి రెస్పాన్స్ ఇచ్చారు!

ఇప్పుడీ హిట్టుతో పవన్ కళ్యాణ్ పేరు మళ్లీ US మార్కెట్‌లో గోల్డ్‌గా మారింది. 🇺🇸 ట్రేడ్ సర్కిల్స్ మాటల్లో చెప్పాలంటే — ఓజీ పవన్ కళ్యాణ్ కు కంబ్యాక్ కాదు, పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపిన సినిమా.

అంటే స్పష్టంగా చెప్పాలంటే —
“OG” మొత్తం వసూళ్లలో దాదాపు 25% అమెరికా నుంచే వచ్చాయి! ఇది పవన్ కెరీర్‌లోనే కాదు, మొత్తం టాలీవుడ్ హిస్టరీలో కూడా ఒక అరుదైన ఫీట్!

USAలో దేవరvs OG: ఎవరు ముందున్నారు?

ఇటీవల NTR – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన “దేవరPart 1” కూడా USAలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
దాని ఫుల్ రన్ గ్రాస్ $6.07 మిలియన్ కాగా, తెలుగువెర్షన్ $5.5M వసూలు చేసింది.

ఇప్పుడు OG ఇప్పటికే $5.43M దాటింది అంటే ఇంకా $70K మాత్రమే వస్తే దేవరరికార్డు బీట్ అవుతుంది! ఈ వారం ఆ ఫీట్ సాధ్యమే అని ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి.

కానీ…
దేవర కి హిందీ, ఇతర భాషల్లో కలెక్షన్ సపోర్ట్ ఉండటం వల్ల, ఫైనల్ టోటల్‌లో కొద్దిగా ఆధిక్యం కొనసాగవచ్చు.

ఏదైమైనా US మార్కెట్‌లో పవన్ కళ్యాణ్ రేంజ్ ఇప్పుడు మారిపోయింది.
“OG” ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి సేఫ్ మాత్రమే కాదు, బంపర్ ప్రాఫిట్ వెంచర్!

ఫైనల్ గా దేవర, ఓజీ …రెండు సినిమాలూ అమెరికాలో సూపర్ ప్రాఫిట్స్ సాధించాయి. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం ఒక్క మాటే మారుమ్రోగుతోంది — “OG దూసుకెళ్తుందా? లేక దేవరకింగ్‌గా నిలుస్తుందా?”

, , , , , ,
You may also like
Latest Posts from