యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న స్థాయికి మాటలు చాలవు. “RRR” తర్వాత ఆయన పాన్‌ ఇండియా స్టార్‌గా నిలిచిపోయారు. హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న ‘వార్ 2’ సినిమాపై నేషనల్ లెవెల్‌లో ఆసక్తి నెలకొంది. ఈ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లోనూ భారీ బజ్ ఉంది. దాంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం అసలైన పోటీ మొదలైంది.

అందుతున్న సమాచారం ప్రకారం, ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఈ హక్కులను తీసుకునేందుకు మాసివ్ డీల్‌ మీద పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఫాలోఅప్‌గా ‘వార్ 2’ రైట్స్ కోసం ₹80 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు ఇండస్ట్రీ బజ్.

ఇక ప్రొడ్యూసర్స్ అడుగుతున్న మొత్తం ₹100 కోట్లు కాగా, డీల్ ₹80-₹90 కోట్ల మధ్యే సెట్ అవుతుందని తెలుస్తోంది. రాజినీకాంత్ ‘కూలీ’ సినిమాను ఏషియన్ గ్రూప్ తీసుకున్న నేపథ్యంలో, ‘వార్ 2’ కోసం కూడా equally big distributor అవసరం ఉంది. ఈ పోటీలో నాగవంశీ front-runner గా కనిపిస్తున్నారు.

తెరపై ఎన్టీఆర్–హృతిక్ మాస్ యాక్షన్, ఎమోషన్ తో కలిపిన భారీ విజువల్ ఫీస్ట్‌గా వస్తోన్న వార్ 2, తెలుగు మార్కెట్‌లో పెద్ద సెన్సేషన్ అవ్వటం ఖాయం.

, , , , , ,
You may also like
Latest Posts from