పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా బ్లాక్‌బస్టర్ ‘OG’ రిలీజై రెండు వారాలు దాటినా థియేటర్లలో ఇంకా దూసుకుపోతోంది. ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం, ‘OG’ త్వరలోనే ఓటీటీలోకి వస్తుందట. ఆన్‌లైన్ బజ్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 23, 2025 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుందట. అయితే… నిర్మాతల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అంటే, సినిమా విడుదలైన నాలుగు వారాలకే ‘OG’ ఓటీటీలోకి వచ్చే అవకాశం బలంగానే కనిపిస్తోంది.

ఈ భారీ యాక్షన్ డ్రామాను DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై DVV దానయ్య మరియు కళ్యాణ్ దాసరి నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు ఎమ్రాన్ హాష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, సుధేవ్ నాయర్, సుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటించారు.

సంగీతం థమన్ అందించగా, కెమెరా వర్క్ రవికే చంద్రన్ చేతిలో మెరిసింది.

మరి Netflix ఎప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తుంది? అభిమానుల్లో ఇదే హాట్ టాపిక్!

, , , , ,
You may also like
Latest Posts from