ఎక్కడ విన్నా ఇప్పుడు రాజమౌళి(Rajamouli),మహేష్ బాబు(Mahesh Babu)కాంబినేషన లో తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ గురించే. ఈ చిత్రం జనవరి 2 న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే.SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ,ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)అయితే కీలకమైన పాత్రకు ఖాయమయినట్టే. రీసెంట్ గా ఆమె హైదరాబాద్ రావడం,లుక్ టెస్ట్ జరగడం కూడా అయిపోయాయి.మేకర్స్ నుంచి ఈ విషయంపై అధికారప్రకటన రావడమే మిగిలి ఉంది. అయితే ఈ సినిమా గురించిన ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారనేది మీడియాలోనూ, అభిమానుల్లోనూ పెద్ద చర్చగా మారింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఫస్ట్ మీట్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైన తర్వాత పెట్టాలని రాజమౌళి ఫిక్సయ్యారట. అప్పుడు కొన్ని ఫొటోలు వదిలి, సినిమాలో చేస్తున్న ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ వివరాలు ప్రకటిస్తారట.
అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ మూవీగా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆర్ ఆర్ ఆర్(RRR)తో ఆస్కార్ ని గెలుచుకొని రాజమౌళి హాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని పొందాడు.
విదేశీ నటులు కూడా మహేష్ మూవీలో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.దీంతో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
విజయేంద్రప్రసాద్(Vijayendhra Prasad)కథని అందిస్తున్న ఈ మూవీని దుర్గ ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ(Kl Narayana)నిర్మిస్తున్నాడు.1000 కోట్ల బడ్జెట్ అనే టాక్ అయితే వినపడుతుంది.