రవితేజ కొత్త సినిమా “మాస్ జాతర” రిలీజ్ డేట్ మార్చడంలో చేసిన రికార్డే వేరే! మొదట సంక్రాంతి 2025కి అనుకున్నారు… తర్వాత మే 9కి మార్చారు… ఆగస్టు 27కి పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు చివరికి అక్టోబర్ 31 ఫైనల్‌గా లాక్ చేశారు.

తాజాగా విడుదల చేసిన ప్రమోలో రవితేజ, హైపర్ ఆది కలిసి ఫన్‌గా ఈ డేట్ మార్పులపై మాట్లాడారు. చివర్లో రవితేజే నిర్మాత నాగవంశీకి ఫోన్ చేసి, “అక్టోబర్ 31 ఫిక్స్… ఇక మారదు… గణేశుడిపై ప్రమాణం!” అని చెప్పిన సీన్‌తో వీడియో ముగిసింది.

ఈ సినిమా రవితేజ ఫేవరెట్ జానర్ అయిన కాప్ డ్రామా. ఇందులో ఆయన సబ్‌-ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్‌గా కనిపించబోతున్నారు. రవితేజకి పోలీస్ రోల్ అంటే ఎప్పుడూ బాక్సాఫీస్ హిట్ అన్న సెంటిమెంట్ ఉందన్న విషయం తెలిసిందే.

‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత రవితేజ, శ్రీలీల జోడీ మళ్లీ స్క్రీన్‌పై కనబడబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ఈసారి “మాస్ జాతర” నిజంగానే అక్టోబర్ 31న థియేటర్లలో గట్టిగా జరుపుకుంటుందా? లేక ఇంకో ట్విస్ట్ వస్తుందా అన్నది చూడాలి.

, , , ,
You may also like
Latest Posts from