తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికీ హీట్ కొనసాగిస్తున్న రెండు భారీ సినిమాలు — ‘OG’ మరియు ‘కాంతారా చాప్టర్ 1’. రిలీజ్‌కి వారం దాటినా, ఇంకా థియేటర్లలో దూసుకుపోతున్నాయి. అయితే నిజానికి… ఈ రెండు సినిమాలు ఇంకా బ్రేక్ ఈవెన్‌ చేరుకోలేదట!

థియేటర్ యజమానులు భారీగా ఇన్వెస్ట్‌ చేయడంతో, ఇప్పుడు కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతున్నా కూడా స్క్రీన్‌లను మార్చడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ దీపావళి వీకెండ్‌లో లాంగ్ హాలిడే ఉండటంతో, “ఇంకా కొంచెం ఆడితే మన డబ్బులు తిరిగి వస్తాయి” అనే లెక్కలో ఉన్నారట థియేటర్ ఓనర్లు.

అదీ కాకుండా ఈసారి విడుదలవుతున్న సినిమాలు చాలా వరకు చిన్న, మధ్యస్థాయి బడ్జెట్ సినిమాలే. అందుకే, ‘OG’, ‘కాంతారా’ లాంటి పెద్ద సినిమాలు ఇంకా బెటర్‌ ఆక్యుపెన్సీ సాధిస్తాయని వారి అంచనా.

ఇక ఈ లెక్కల వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తలనొప్పిలో పడ్డారు! ఈ దీపావళికి నాలుగు కొత్త సినిమాలు విడుదల కానుండగా, స్క్రీన్ కౌంట్ దొరకడం కష్టసాధ్యం అయింది.

దీపావళి రేస్‌లో ఎవరు విన్ అవుతారు? పెద్ద సినిమాల దెబ్బ తట్టుకుని కొత్త సినిమాలు నిలబడతాయా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

, , , , , ,
You may also like
Latest Posts from