2015లో విడుదలైనప్పుడు తెలుగు సినిమా చరిత్రలో ఒక తిరుగులేని మైలురాయిగా నిలిచిన సినిమా బాహుబలి. అప్పటివరకు తెలుగు సినిమా ఏదీ చేయని విధంగా ఊహకు అతీతమైన విజువల్స్‌తో, అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను శాసించిందీ సినిమా. “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్న దేశమంతా హాట్ టాపిక్ గా మారిన సందర్భాన్ని ఎవరు మరచిపోతారు?

ఇప్పుడు అదే బాహుబలి మరోసారి మాయాజాలం అల్లేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి సినిమాకు పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా కొత్త ప్రయోగానికి నాంది పలికారు. ‘బాహుబలి: ది ఎపిక్‌’ పేరుతో రెండు భాగాలని ఒకే చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు!

విశేష వేళ: అక్టోబర్ 31, 2025

రాజమౌళి ఇటీవల ఎక్స్ (Twitter) లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. “బాహుబలి.. ఎన్నో ప్రయాణాలకు నాంది. లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలు. అంతులేని ప్రేరణ. ఇప్పుడు ఈ కథను ఒకే భాగంగా — బాహుబలి: ది ఎపిక్గా — ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం,” అని వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ స్పెషల్ ఎడిషన్ అభిమానులకు ఒక ఫెస్టివల్ లాంటి అనుభూతిని కలిగించనుంది.

ఐదున్నర గంటల కథ.. ఒకే భాగంగా!

‘బాహుబలి: ది బిగినింగ్’ (2 గంటల 38 నిమిషాలు), ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ (2 గంటల 47 నిమిషాలు) కలిపి దాదాపు 5.5 గంటల ఈ విజువల్ ఎపిక్‌ను తిరిగి ఎడిట్ చేసి, ఒకే ఫ్లోలో ప్రేక్షకులకు అందించనున్నారు. ఇది కేవలం రీ-రిలీజ్ కాదు — ఇది రాజమౌళి చేస్తున్న ఓ వినూత్న సృజనాత్మక ప్రయోగం.

కథలో మళ్లీ మాయజాలం

పగ, ప్రేమ, త్యాగం, ద్రోహం, ప్రతీకారం, రాజకీయం వంటి ఎన్నో భావోద్వేగాల మేళవింపుతో కూడిన ఈ గాథ — అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలలో ప్రభాస్, భల్లాలదేవగా రానా దగ్గుబాటి, దేవసేనగా అనుష్క శెట్టి, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవగా నాజర్ – ఎవరికీ మరచిపోలేని పాత్రలు.

పాన్ ఇండియా నుంచి గ్లోబల్ సెన్సేషన్ వరకూ

తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమా, అప్పట్లో భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా అనే కాన్సెప్ట్‌ను స్థిరపరిచింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్, స్కేల్ అన్నింటికీ ఇది ఒక బెంచ్‌మార్క్.

ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్

2025 అక్టోబర్ 31న థియేటర్లలో ‘బాహుబలి: ది ఎపిక్‌’ను చూశాక, అభిమానులు మళ్లీ అదే అనుభూతిని వెండి తెరపై ఆస్వాదించనున్నారు. ఇది కేవలం ఓ సినిమాని మళ్లీ చూడటం కాదు — ఓ లెజెండరీ ప్రయాణాన్ని మరోసారి జీవించడం.

, , , , , , , , ,
You may also like
Latest Posts from