రిలీజ్‌కి ముందు‘వార్ 2’మీద ఉన్న క్రేజ్ ఊహించలేనంతగా ఉంది.హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ల కాంబో, భారీ బడ్జెట్, స్పై యాక్షన్ డ్రామా అంటూ బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు టాప్‌కి చేరాయి. ఇండస్ట్రీ టాక్ ఒక్కటే –“వార్ 2 వెయ్యి కోట్ల మార్క్ దాటడం ఖాయం”అని.
అయితే ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రిలీజ్ డే ఎర్లీ షో ల నుంచే నెగటివ్ రివ్యూలు, పూర్ వర్డ్ ఆఫ్ మౌత్ దారుణంగా వచ్చాయి. ఫలితం – కలెక్షన్స్ బాగా ప్రభావితమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊహించిన స్థాయిలో ఓపెనింగ్స్ పై కూడా దెబ్బ పడింది. అంటే చాలా నష్టం రావాలి కదా , కానీ అలాంటిదేమీ జరగలేదుని బాలీవుడ్ ట్రేడ్ అంటోంది.
బాక్సాఫీస్ లెక్కలు:
- హిట్ స్టేటస్‌కి కనీసం₹700 కోట్ల గ్రాస్ కావాల్సింది.
- కానీ 11 రోజుల్లో కేవలం₹320 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది.
- బడ్జెట్₹400 కోట్లుఅయినా,నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే 50% రికవరీఅయ్యింది.
- తెలుగు రాష్ట్ర రైట్స్‌తో మరో 20% వసూలు చేశారు.
- మిగతా ఏరియాస్ కలిపి100 కోట్లు షేర్ దక్కడంతో, నిర్మాతకి పెట్టిన బడ్జెట్ మార్గిమం వెనక్కి తిరిగొచ్చింది.
మొత్తానికి…వార్ 2 భారీ డిసప్పాయింట్‌మెంట్ అయినా, నిర్మాతకు మినిమల్ లాస్ మాత్రమే వచ్చింది.మార్కెటింగ్ ఖర్చులు, తెలుగు బయ్యర్స్‌కి కొంత కాంపెన్సేషన్ తప్పించి పెద్ద నష్టం ఏమీ లేదని ట్రేడ్ టాక్.