ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా “వార్ 2” ను ఎంచుకోవడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపింది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ హైప్ వల్ల తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చర్చనీయాంశమైంది.
అయితే విడుదల రోజు నుంచే ‘నెగటివ్ రివ్యూలు, మిక్స్‌డ్ టాక్’ రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు ఆడియన్స్ ఈ స్పై యాక్షన్ థీమ్‌తో పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారు. భారీ అంచనాల మధ్య నాగవంశీ 82 కోట్లకుపైగా తెలుగు రైట్స్ కొన్నా…ఫస్ట్ వీకెండ్ షేర్ 37.5 కోట్లు (GST తో కలిపి) మాత్రమే వచ్చాయి.
బ్రేక్ ఈవెన్ కావాలంటే 95 కోట్ల దాకా వసూలు కావాలి కానీ, ఫైనల్‌గా 45 కోట్లకే ఆగిపోనుందని ట్రేడ్ అంచనా. అంటే డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు ‘50% లాస్’ ఖాయం అని చెప్పొచ్చు.
కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు…కర్ణాటకలోనూ, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ “వార్ 2” తెలుగు వెర్షన్ బలహీనంగా ఆడింది. ప్రత్యేకంగా USAలో కలెక్షన్ ఒక మిలియన్ డాలర్ మార్క్ కూడా దాటలేకపోవడం షాకింగ్.
మొత్తానికి, “వార్ 2” కు ఉన్న క్రేజ్ మొదటి షో వరకు మాత్రమే నిలిచిపోయింది. తర్వాత నెగటివ్ టాక్, రివ్యూలు కలిసివచ్చి, ‘తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా స్పష్టంగా రిజెక్ట్ చేసినట్లే’ అయింది.