ఈ ఆగస్టు 14న రజనీకాంత్ ‘కూలీ’, హృతిక్-టైగర్ ‘వార్ 2’ మధ్య భారీ బాక్సాఫీస్ పోటీ నడవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రీ-బుకింగ్స్ జోరుగా మొదలయ్యాయి. అయితే వీటి డేటా చూస్తే, కూలీ లీడర్‌గా నిలిచింది.
కూలీ ప్రీ-బుకింగ్స్:
ఇప్పటివరకు 70 కోట్ల గ్రాస్ గ్రాస్
మొదటి రోజు 100 కోట్లు గ్రాస్ సాధించనున్న భారీ అంచనాలు
దేశీయ, విదేశీ మార్కెట్లలో మంచి రెస్పాన్స్
నార్త్ అమెరికాలో ‘కబాలి’ రికార్డ్‌ను కూడా మించే అవకాశాలు
వార్ 2 ప్రీ-బుకింగ్స్:
ప్రీ-బుకింగ్స్ మొత్తం 15 కోట్ల గ్రాస్‌కు చేరలేదు
హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా, ఆశించినంత స్పందన రాలేదని తెలుస్తోంది.
టికెట్ ధర పెంపుతో బజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు
కూలీ ముందు నుంచే భారీ లీడ్ తీసుకువస్తోంది. ఇక వార్ 2 మాత్రం మాటలు, రివ్యూలపై ఆధారపడి శుక్రవారం నుండి బలమైన కమర్షియల్ పర్ఫార్మెన్స్ కోసం వేచి ఉండాలి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం పండుగ చుట్టూ ఈ రెండు భారీ సినిమాల పోటీ అద్భుతంగా సాగనుంది.